: ఆంధ్రా లెక్కలన్నీ తప్పుడు తడకలే: కేసీఆర్ ప్రభుత్వ వాదన


కృష్ణా జలాల నీటి వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పుడు తడకలేనని కేసీఆర్ సర్కారు వాదించింది. నదిపై ప్రకాశం బ్యారేజ్ దిగువనే 124 శతకోటి ఘనపుటడుగులను ఏపీ వాడుకుంటోందని ఆరోపించింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో భేటీ సందర్భంగా తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ తమ వద్ద వున్న లెక్కలను వివరించారు. ఏపీ మొండి వాదనను తప్పుబడుతూ, 20 టీఎంసీల మేర నీటి వినియోగాన్ని తక్కువగా చూపుతోందని; నీటి వినియోగానికి, బోర్డుకు చూపుతున్న లెక్కలకు పొంతన లేదని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ఎక్కువగా వాడుకుంటోందని ఆరోపిస్తున్న ఏపీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తెలంగాణకు 50 టీఎంసీలు అదనంగా కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ తెలంగాణ 36 టీఎంసీలను మించి నీటిని వాడుకోలేదని, ఇక తాము 89 టీఎంసీలు వాడుకుంటున్నట్టు చేస్తున్న ఏపీ వాదన నిరాధారమని వెల్లడించారు.

  • Loading...

More Telugu News