: ప్రజలు కేంద్రంలా ఆలోచిస్తే సమస్యలేదు: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్


ప్రజల ఆలోచనా విధానం మారాలని టీడీపీ నేత బాబూరాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టు ఆలోచిస్తే సమస్యలు ఉండవని అన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల మంచి జరుగుతుందని కేంద్రం చెబుతోందని, ప్రజలు కూడా అలాగే ఆలోచించాలని ఆయన సూచించారు. అలా కాకుండా సమస్యలు ఎదురవుతున్నాయని అనకూడదని తెలిపారు. ఈ ప్రయత్నం విఫలమైతే...మోదీగారిని మరో ప్రయత్నం చేయమందామని ఆయన చెప్పారు. అంతే కాని ఆయనను నిరుత్సాహపరచకూడదని, విమర్శలు చేయవద్దని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News