: జయలలితతో కలిసి నటించడం నా అదృష్టం: నటి శ్రీదేవి


జయలలితతో కలిసి నటించడం తన అదృష్టమని ప్రముఖ నటి శ్రీదేవి అన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ఒక ట్వీట్ లో ఆమె ఈ విషయాన్ని పేర్కొంది. ‘ఎంతో గౌరవప్రదమైన, సంస్కారవంతమైన, ఎంతో సహాయకారి, దయాగుణం కల్గిన ఆమెతో కలిసి నటించడం నా అదృష్టం. అయితే, జయలలిత మృతి ఆవేదనకు గురిచేస్తోంది. నాతో పాటు లక్షలాది మంది ప్రజలు ఆమెను పోగొట్టుకున్నారు’ అని ఆ ట్వీట్ లో పేర్కొంది. కాగా, 1971వ సంవత్సరంలో తమిళంలో విడుదలైన 'ఆది పరాశక్'తి చిత్రంలో అమ్మవారి పాత్రలో జయలలిత, శివుడి పాత్రలో జెమినీ గణేశన్ నటించారు. వారి కొడుకు సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో చిన్నారి శ్రీదేవి నటించింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో జయలలితో తాను కలిసి ఉన్న ఒక ఫొటోను శ్రీదేవి పోస్ట్ చేసింది.

  • Loading...

More Telugu News