: అమెరికాలోని కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.9గా నమోదు


అమెరికాలోని కాలిఫోర్నియాను భూకంపం కుదిపేసింది. కాలిఫోర్నియాలోని ఫెరండేల్ సమీపంలోని సముద్రంలో పది కిలోమీటర్ల లోతులో దీని భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. నేటి ఉదయం 7 గంటలు సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.9గా నమోదైంది. దీంతో ఇది పెను భూకంపమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ భూకంప తీవ్రతకు సంభవించిన నష్టంపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా, వేకువజాము నుంచి న్యూయార్క్ లోని వివిధ ప్రాంతాల్లో పది సార్లు చిన్న స్థాయి ప్రకంపనలు సంభవించినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఉదయం సంభవించిన భూకంపం మాత్రం కాస్త తీవ్రమైనదేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News