: రూ. 10 లక్షల కొత్త నోట్లు ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు
పెద్ద నోట్ల రద్దుతో ఉగ్రవాదులు సైతం చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల్లేక చాలా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, వారు ఏకంగా బ్యాంకులను టార్గెట్ చేశారు. జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఓ బ్యాంకును లూటీ చేశారు. బ్యాంకులో ఉన్న రూ. 10 లక్షల విలువైన కొత్త నోట్లను వారు ఎత్తుకుపోయారు. గత 20 రోజుల్లో టెర్రరిస్టులు బ్యాంకులను లూటీ చేయడం ఇది రెండోసారి. మరోవైపు, బ్యాంకును లూటీ చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.