: తెలుగు ప్రేక్షకులకు త్వరలోనే తీయని వార్త: సమంత


‘జనతా గ్యారేజ్‌’ తరువాత టాలీవుడ్ లో మరే సినిమాను అంగీకరించని సమంత, తాను అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్తుండడంతో తనకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని అంటోంది. అయినా సరే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, చైతన్యతో తాను సంతోషంగా ఉండగలనని, 'ఏం మాయ చేశావే' సమయంలోనే చైతూ అంతా చూసుకున్నాడని, ఇప్పుడు ఇలా ఉన్న పళంగా అన్నీ వదిలి వచ్చేసినా చైతూ తనని చూసుకుంటాడని, కెరీర్ పై ఎలాంటి దిగులు లేదని పేర్కొంది. అయితే ఇలా ప్రకటించిన 24 గంటలు గడవక ముందే... తన తదుపరి సినిమాపై ట్వీట్ చేసింది. తాను నటించనున్న ఆసక్తికరమైన ప్రాజెక్టు గురించి త్వరలో ప్రకటించనున్నానని తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇంతకీ ‘తెలుగా? లేక తమిళమా?’ అని ఓ అభిమాని ప్రశ్నించగా ‘తెలుగు’ అని సమాధానం ఇచ్చింది. దీంతో త్వరలో సమంత తెలుగు సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News