: రూట్ ఔట్... తొలి మ్యాచ్ లోనే సత్తా చాటుతున్న జెన్నింగ్స్
వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. డేంజరస్ బ్యాట్స్ మెన్ జో రూట్ కేవలం 21 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ ఓ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో రూట్ ఔట్ అయ్యాడు. మరోవైపు, తొలి టెస్ట్ ఆడుతున్న ఓపెనర్ జెన్నింగ్స్ నిలకడగా ఆడుతూ 78 పరుగులతో కొనసాగుతున్నాడు. అతనికి అండగా మొయిన్ అలీ (4) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ప్రస్తుత స్కోరు రెండు వికెట్ల నష్టానికి 150 పరుగులు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో వికెట్ తీశారు.