: సోనీతో కపిల్ శర్మ కాంట్రాక్ట్ విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు...!


ప్రస్తుతం సోనీ టీవీలో ప్రసారమవుతున్న 'ది కపిల్ శర్మ షో'తో దేశ వ్యాప్తంగా స్టార్ కమేడియన్ గా కపిల్ శర్మ అత్యంత పాప్యులరైన సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టాడు. గతంలో కలర్స్ టీవీలో ప్రసారమైన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' బాగా పాప్యులర్ కావడంతో హిందీ బుల్లితెరపై అతని హవా ప్రారంభమైంది. తొలుత కొన్ని కామెడీ షోల్లో సాధారణ రెమ్యూనరేషన్ పొందిన కపిల్, అనతి కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకున్నాడు. అయితే, కలర్స్ టీవీ నిర్వాహకులతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ టీవీతో బంధాన్ని తెంచేసుకుని, సోనీతో ఒప్పందం చేసుకుని, 'ది కపిల్ శర్మ షో' పేరిట కొనసాగిస్తున్నాడు. ఇక్కడ కూడా ఈ షో సూపర్ హిట్ కావడంతో కపిల్ రెమ్యూనరేషన్ అమాంతం ఆకాశానికి అంటుతోంది. ఈ నేపథ్యంలో 2017 సంత్సరానికి కపిల్ తో సోనీ టీవీ కొత్త కాంట్రాక్టును కుదుర్చుకుంటోంది. కాంట్రాక్ట్ విలువ దాదాపు రూ. 110 కోట్లు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కు కపిల్ శర్మ రూ. 60 నుంచి 80 లక్షల వరకు వసూలు చేస్తున్నాడట. ఈ క్రమంలో, బాలీవుడ్ లో అత్యధిక మొత్తంలో సంపాదన కలిగిన వారి సరసన కపిల్ కూడా నిలిచాడు.

  • Loading...

More Telugu News