: 41 ఏళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదు... ముంబై ప్లేయర్ లేకుండా ముంబైలో టెస్ట్!


భారత క్రికెట్ పై ముంబైకి ఉన్నంత కంట్రోల్ మరే సిటీకి ఉండదంటే ఎలాంటి సందేహం లేదు. టీమిండియాకు ఆడిన దిగ్గజాలలో అనేక మంది ముంబై నుంచి వచ్చిన వారే. ముంబై ప్లేయర్లు లేకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ ను అసలు ఊహించుకోలేం. ఒకానొక సమయంలో అరడజను ముంబై ఆటగాళ్లు తుది జట్టులో ఉండటాన్ని కూడా చూశాం. కనీసం ఒక్క ముంబై ప్లేయర్ అయినా జట్టులో ఉంటాడు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇంగ్లండ్ తో ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఒక్క ముంబై ఆటగాడు కూడా లేడు. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ముంబైయేతర ఆటగాళ్లే. ముంబై ఆటగాడు రహానే గాయం కారణంగా మ్యాచ్ కు దూరం కావడంతో... ముంబైలో ముంబై ఆటగాడు లేకుండా మ్యాచ్ జరుగుతోంది. 1775 నుంచి గత 41 ఏళ్లలో ఇలా ఎన్నడూ జరగలేదు.

  • Loading...

More Telugu News