: మోదీ కార్యక్రమంతో 'ఆల్ ఇండియా రేడియో'కి కోట్ల రూపాయల ఆదాయం


భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో అనుసంధానం కావడానికి రేడియోను ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రసంగించే కార్యక్రమం 'మన్ కీ బాత్' ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఆయన చేసే ప్రసంగాన్ని దేశ వ్యాప్తంగా లక్షలాది మంది శ్రోతలు మిస్ కాకుండా వింటున్నారు. దీంతో, ఆల్ ఇండియా రేడియోకు కాసుల వర్షం కురుస్తోంది. 2015-16 ఏడాదికి గాను... ఈ కార్యక్రమానికి వాణిజ్య ప్రకటనల ద్వారా రూ. 4.78 కోట్ల ఆదాయం సమకూరిందని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కేవలం రేడియో ప్రసారాల ఆదాయమేనని... యాప్, ఆన్ లైన్ స్ట్రీమింగ్ తదితర మాధ్యమాల ఆదాయాన్ని ఇందులో కలపలేదని తెలిపింది.

  • Loading...

More Telugu News