: కూలిన విమానంలో పాక్ మతబోధకుడైన సింగర్...అభిమానుల్లో విషాదం
పాకిస్థాన్ లోని ఖైబర్ ఫంక్తూన్ లోని అబోటాబాద్ వద్ద కూలిపోయిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమాన ప్రమాదంలో ఆ దేశ మతబోధకుడైన ప్రముఖ సింగర్ జునైద్ జమ్షద్ (52) మరణించినట్టు సమాచారం. చిత్రాల్ నుంచి 47 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఈ విమానం అబోటాబాద్ సమీపంలోకి రాగానే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కుప్పకూలినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో స్థానికులతో కలిసి సైనిక సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ లో ఇంజనీర్ గా సేవలందించిన జునైద్ తరువాత సింగర్, మత బోధకుడిగా మారారు. ఈ విమానంలో ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టు తెలుస్తోంది.