: పెద్ద ఎత్తున రూ.500 కొత్త నోట్లు అందుబాటులోకి వస్తున్నాయి: శక్తికాంత దాస్


పెద్దనోట్ల రద్దు తరువాత చిల్ల‌ర దొర‌క్క ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల ప‌ట్ల కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ స్పందిస్తూ.. భారీ ఎత్తున ఐదువంద‌ల రూపాయ‌ల నోట్లు అందుబాటులోకి రానున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు, నాలుగు వారాల్లో దేశవ్యాప్తంగా ఐదొందల నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయ‌ని చెప్పారు. క‌రెన్సీ కొర‌తతో దేశ వ్యాప్తంగా ప్రజలు ప‌డుతున్న ఇబ్బందుల‌ను దూరం చేసేందుకు కేంద్ర స‌ర్కారు వేగంగా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News