: పాకిస్థాన్ లో కుప్పకూలిన విమానం


పాకిస్థాన్ లో విమానం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన పీకే-116 విమానం 47 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తూ ఖైబర్ ఫంక్తూన్ లో గల అబాటోబాద్ సమీపంలో కుప్పకూలింది. అబాటో బాద్ పరిసరాల్లోకి వెళ్లగానే విమానానికి రాడార్ తో సంబంధాలు నిలిచిపోయాయని, అనంతరం కాసేపట్లో విమానం కుప్పకూలినట్టు తెలిసిందని వైమానిక అధికారులు తెలిపారు. స్థానికులు, ఆర్మీ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News