: గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి మెడ‌కు మ‌రో ఉచ్చు... నోట్ల మార్పిడికి పాల్ప‌డిన వైనం.. ఓ వ్యక్తి ఆత్మహత్యతో వెలుగులోకి నిజాలు


పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలోనూ మాజీ మంత్రి, అక్ర‌మ‌ మైనింగ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న‌ గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి త‌న కూతురి పెళ్లిని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు గాలి జ‌నార్ద‌న్‌కు చెందిన ఆఫీసుల‌పై దాడులు కూడా జ‌రిపారు. ఇదిలా ఉంచితే, జ‌నార్ద‌న్ రెడ్డి నోట్ల మార్పిడి చేశార‌ని తాజాగా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకు బ‌ల‌మైన సాక్ష్యాలు ల‌భించాయి. బళ్లారిలోని రెవెన్యూ అధికారి భీమ నాయక్ డ్రైవ‌ర్ ర‌మేశ్ గౌడ ఈ రోజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆయ‌న రాసిన సూసైడ్ లెట‌ర్‌తో ప‌లు విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. రెవెన్యూ అధికారి సాయంతో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి నోట్లు మార్చుకున్నార‌ని, అందులో తాను కూడా పాలుపంచుకున్నాన‌ని అయితే, ఇప్పుడు గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి అనుచ‌రుల‌ నుంచి, త‌న‌ను చంపేస్తామ‌నే కాల్స్ వ‌స్తున్నాయ‌ని ఆ లేఖ‌లో రాశాడు. జ‌నార్ద‌న్‌రెడ్డి వ‌ద్ద‌కు మార్చిన నోట్లు త‌క్కువ వ‌చ్చాయ‌ని, మిగతావి ఏమ‌య్యాయంటూ త‌న‌కు బెదిరింపులు వస్తున్నాయ‌ని పేర్కొన్నాడు. మరోపక్క, బ‌ళ్లారిలో 20 శాతం క‌మిష‌న్‌తో గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి మొత్తం రూ.100 కోట్లు మార్చార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News