: ఇండోనేషియాలో భారీ భూకంపం ధాటికి ఇప్పటివరకు 25 మంది మృతి.. భారీగా ఆస్తినష్టం
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల్లోని ఆసె ప్రావిన్స్‌లో ఈ రోజు తెల్లవారు జామున రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. సునామీ భయం ఏమీ లేదని అమెరికా భూభౌతిక సర్వే సంస్థ కూడా ధ్రువీకరించింది. అయితే, ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు 25 మంది మృతి చెందినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. వారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. క్షతగాత్రుల్ని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. భూకంపం ధాటికి భారీగా ఆస్తినష్టం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు.