: రాత్రిపూట ఘోరంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు ... పగలు మాత్రం సాధారణంకన్నా 5 డిగ్రీలు అధికం!


తెలుగు రాష్ట్రాల్లో వింతైన వాతావరణ పరిస్థితి నెలకొంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతుండగా, పగలు మాత్రం సాధారణం కన్నా అధికంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి రోగులు, వృద్ధులకు ప్రాణాపాయాన్ని కలిగిస్తుందని, ముఖ్యంగా పగటి పూట ఉష్ణోగ్రతల మార్పుతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని ఏజన్సీ ప్రాంతాలతో పాటు చిత్తూరు, అనంతపురం, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో భారీ వ్యత్యాసం నమోదవుతోంది. గిరిజనులు చలికి తట్టుకోలేకపోతున్నారు. పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

  • Loading...

More Telugu News