: పట్టాలు తప్పిన కేపిటల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరి మృతి, 34 మందికి గాయాలు
గువాహటి కేంద్రంగా నడిచే కేపిటల్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం రాత్రి సాముక్‌తలా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. రెండు బోగీలు పూర్తిగా పక్కకు ఒరిగిపోయి ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో 34 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. అలీపూర్‌దువార్ జిల్లా కేంద్రానికి 32 కిలోమీటర్ల దూరంలో రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులను అలీపూర్‌దువార్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు.