: జయలలితకు ఆధార్ కార్డు లేదా? లేక అధికారులకు తెలియదా?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన అనంతరం చెన్నై కార్పొరేషన్ అధికారులు ఆమె పేరిట మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు డెత్ సర్టిఫికెట్ జారీ చేయగా, ఆమె తల్లి పేరు జే సంధ్య అని, తండ్రి ఆర్ జయరాం అని వెల్లడిస్తూ, ఆమె చిరునామా కూడా తెలిపారు. ఇక ఇదే సర్టిఫికెట్ లో ఆధార్ కార్డు సంఖ్య రాయాల్సిన చోట ఖాళీగా వదిలేశారు. దీంతో జయలలిత అసలు ఆధార్ కార్డును తీసుకున్నారా? అన్న ప్రశ్న తలెత్తింది. ఒకవేళ తీసుకుని ఉంటే, ఆధార్ సంఖ్య ఎంతన్న విషయం అధికారులకు తెలియదా? అన్న చర్చ జరుగుతోంది.