: ఆ ఎమ్మెల్యేకు జయలలిత ‘తెలుగు’లోనే సమాధానమిచ్చారు!


తెలుగు ప్రజల సంక్షేమం గురించి తమిళనాడు అసెంబ్లీలో గతంలో ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు జయలలిత తెలుగులోనే సమాధానమిచ్చారు. తమిళనాడులోని హోసూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గోపీనాథ్ తెలుగు ప్రజల సంక్షేమం గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జయలలిత తెలుగు భాషలోనే సమాధానమిచ్చారు. ‘అన్ని భాషలు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం.. ఏం చేయాలో చెప్పండి?’ అని ఆమె అనడంతో అసెంబ్లీ సభ్యులు ఆశ్చర్యపోయారు. బల్లలు చరుస్తూ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రెస్ మీట్ లలో కూడా ‘తెలుగు’లో అడిగిన ప్రశ్నలకు జయలలిత ‘తెలుగు’లోనే సమాధానమిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడంతో, అది వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News