: ఐడీఎస్ స్కీంలో నల్లధనం వెల్లడించిన హైదరాబాదుకు చెందిన వ్యక్తి నివాసం, బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఐడీఎస్ స్కీంలో హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి తన వద్ద పది వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు వెల్లడించాడని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బి.లక్ష్మణరావు తన వద్ద 9,800 కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రకటించినట్టు, ఈ నేపథ్యంలో ఈ మొత్తానికి ఆదాయపుపన్ను శాఖకు చెల్లించాల్సిన మొదటి వాయిదా పన్నులు 1,125 కోట్ల రూపాయలు ఆయన చెల్లించలేదు. దీంతో ఆయన నివాసం, ఆయన ఆడిటర్ కార్యాలయం, నివాసం, బంధువుల ఇళ్లపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ఆయన వద్ద అంతపెద్ద మొత్తంలో డబ్బు ఉండే అవకాశం లేదని, ఆయన పలువురికి బినామీగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాన్ని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వ్యక్తం చేశారు.