: చెన్నై టెస్టుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు... ప్రజల మూడ్ బట్టి నిర్ణయం తీసుకుంటాం: షిర్కే


జ‌య‌ల‌లిత మృతితో చెన్నైలో జ‌ర‌గాల్సిన ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. జయలలిత మరణంతో తీవ్ర వేదనలో కూరుకుపోయిన తమిళ ప్రజలు ఆ బాధ నుంచి త్వరగా కోలుకుంటారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా, ఇంగ్లిష్ జట్ల మధ్య నిర్వహించాల్సిన మ్యాచ్ ఇక్క‌డే నిర్వ‌హించడం కుదురుతుందా? లేక వేదిక‌ను మార్చాలా? అన్న‌దానిపై ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేద‌ని, మరికొంత సమయం వేచి చూడాల‌ని బీసీసీఐ భావిస్తోందని బీసీసీఐ కార్య‌ద‌ర్శి అజ‌య్ షిర్కే తెలిపారు. కాగా, డిసెంబ‌ర్ 16 నుంచి 20 వ‌ర‌కు ఇండియా, ఇంగ్లండ్ ఐదో టెస్ట్ చెన్నైలో జ‌ర‌గాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జ‌య‌ల‌లిత మృతి చెందడంతో పరిణామాలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. దీంతో ఐదో టెస్టుపై ఉత్కంఠ నెలకొంది. చర్చలు, విశ్లేషణల్లో టెస్టు నిర్వహించడం సాహసమే అవుతుందని పలువురు పేర్కొంటుండడంతో తదుపరి చర్యలపై బీసీసీఐ పరిశీలిస్తోందని, పరిస్థితులను సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News