: ‘జీవితంలో మ‌న‌కు రెండు అవకాశాలు ఉంటాయి’.. సెహ్వాగ్‌ స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్పిన సచిన్‌


టీమిండియా మాజీ ఆట‌గాడు సచిన్‌ టెండూల్కర్ నిన్న వీరేంద్ర‌ సెహ్వాగ్‌కు చెందిన‌ ఇంటర్నేషనల్‌ స్కూల్ కు వెళ్లాడు. అక్కడి విద్యార్థుల‌కు ప‌లు అంశాల‌ను గురించి తెలియ‌జెప్పాడు. వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాడు. ఈ సంద‌ర్భంగా ఓ విద్యార్థి ‘ఓట‌ముల‌ను ఎలా ఎదుర్కోవాలి?’ అని అడిగాడు. దీనికి స‌చిన్ స‌మాధానం ఇస్తూ ముందు అపజయాల గురించి ఆలోచించడం మానేయ్యాలని ఆ విద్యార్థికి స‌ల‌హా ఇచ్చాడు. భ‌విష్య‌త్తులో ఏమి సాధించాలని అనుకుంటున్నావో దానిపై మాత్ర‌మే దృష్టి పెట్టాలని సచిన్ సూచించాడు. గ‌తంలో తాను పరుగులు చేయడంలో ఇబ్బందులు పడ్డప్పుడు తన సోదరుడు త‌న‌కు ఇదే స‌ల‌హాను ఇచ్చాడ‌ని చెప్పాడు. తన కొడుకు, కూతురికి తాను త‌రుచుగా ఓ మాట చెబుతాన‌ని అన్నాడు. మ‌న‌కు రెండవకాశాలు ఉంటాయ‌ని, మొదటిది మ‌న‌కున్న వాటి గురించి దేవుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయ‌డం అయితే, రెండోది జీవితంలో మ‌న‌కు లేని వాటి గురించి ఫిర్యాదు చేయడమ‌ని అన్నారు. వాటిల్లో ఏది ఎంచుకోవాలో వారి ఇష్టం అని త‌మ కొడుకు, కూతురితో చెబుతానని అన్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News