: నేను ‘తమిళియన్’నే.. ‘కన్నడిగ్’ని కాదని ధైర్యంగా చెప్పిన జయలలిత!
నేను ‘తమిళియన్’నే.. ‘కన్నడిగ్’ని కాదని ధైర్యంగా నాడు జయలలిత సమాధానమిచ్చారట. జయలలిత సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆమెకు పీఆర్వో గా వ్యవహరించిన ఆనందన్ ఒక సందర్భంలో ఈ విషయం చెప్పారు. ఆ సంఘటన గురించి ఆయన వివరిస్తూ.. కొన్నేళ్ల క్రితం మైసూరులోని చాముండీ స్టూడియోలో జరుగుతున్న ఒక షూటింగ్ లో జయలలిత పాల్గొన్నారు. ‘నేను తమిళియన్ ని’ అని జయలలిత తనకు తానుగా ప్రకటన చేయడంపై క్షమాపణలు చెప్పాలంటూ స్టూడియో వద్దకు వచ్చిన కొంతమంది డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు ఏమాత్రం చలించని జయలలిత, తనకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, తాను చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి తప్పులేదని వారికి సమాధానం చెప్పారట. నేను ‘తమిళియన్’నే.. ‘కన్నడిగ్’ని కాదని ధైర్యంగా మరోమారు చెప్పారని ఆనందన్ నాటి సంఘటనను ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు.