: పెద్ద నోట్ల రద్దు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన రష్యా
భారత ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో... ఇండియాలో ఉన్న తమ దౌత్య ప్రతినిధులు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. వారానికి రూ. 50 వేలు మాత్రమే విత్ డ్రా చేయాలంటూ నిబంధన విధించడం వల్ల తమ అధికార ప్రతినిధులు కష్టాలు పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం అనుమతిస్తున్న డబ్బుతో ఒక మంచి భోజనం కూడా చేయలేమని తెలిపింది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే, భారత్ లో తమ పనులు నెమ్మదిస్తాయని హెచ్చరించింది. తమ అధికారుల కష్టాలు తీర్చలేకపోతే... తమ ప్రత్యామ్నాయాలను తాము చూసుకుంటామని చెప్పింది. చిన్న చిన్న పనులకు కూడా డబ్బును విత్ డ్రా చేసుకునే పరిస్థితి తమ అధికారులకు లేకుండా పోయిందని తెలిపింది.