: మరో పెంపుడు శునకాన్ని పెంచుకోమంటే నాడు జయలలిత ఏమన్నారో తెలుసా!
జయలలితకు శునకాలు అంటే ఎంతో ఇష్టం. 1998లో తన పెంపుడు శునకం ‘జూలీ’ చనిపోయింది. ఆ తర్వాత, ఆమె సన్నిహితులు ఒకరు మరో పెంపుడు శునకాన్ని పెంచుకోవాలని నాడు ఆమెకు సూచించారు. అందుకు, జయలలిత ఏమని సమాధానమిచ్చారంటే.. ‘మరో పెంపుడు శునకం చనిపోవడాన్ని నేను భరించలేను’ అని ఆమె చెప్పారట. కాగా, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ ప్రభుత్వంలో నాడు అన్నాడీఎంకే కూడా ఉంది. నాడు జరిగిన ఒక మీటింగ్ లో పలువురు బీజేపీ అగ్రనేతలు పాల్గొన్న సమావేశానికి జయలలిత కూడా హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ఆమె ఉన్న సమయంలోనే తన పెంపుడు శునకం ‘జూలీ’ చనిపోయినట్లు సమాచారం ఆమెకు తెలిసింది. వెంటనే, ఆ మీటింగ్ నుంచి ఆమె అర్థాంతరంగా వెళ్లిపోవడంపై పలు విమర్శలు వచ్చాయి.