: పట్టాలు తప్పిన గూడ్స్... 97 బీఎండబ్ల్యూ కార్లు ధ్వంసం


బీఎండబ్ల్యూ కార్లను తీసుకెళుతున్న ఓ గూడ్స్ పట్టాలు తప్పడంతో... అందులో ఉన్న అత్యంత ఖరీదైన 97 బీఎండబ్ల్యూ కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. సౌత్ కరోలినాలోని గ్రీర్ లో ఉన్న బీఎండబ్ల్యూ ప్లాంటు నుంచి వంద కార్లను తీసుకుని ఈ గూడ్స్ బయలుదేరింది. కొలంబియా రాష్ట్ర రాజధాని సమీపంలో ఆదివారం నాడు ఈ గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోనప్పటికీ... కార్లు మాత్రం ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం వల్ల అక్కడ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లైన్ క్లియర్ చేసేంత వరకు ఇబ్బందులు తప్పవని సంబంధిత అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News