: త్వరలో థియేటర్లలో ఐదో ఆటకు అనుమతి: మంత్రి తలసాని
చిన్న సినిమాల నిర్మాతలు థియేటర్లు దొరక్క ఎదుర్కుంటున్న ఇబ్బందులను తొలగించేందుకు త్వరలో థియేటర్లలో ఐదో ఆటకు అనుమతిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా మారుస్తామని చెప్పారు. అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడ ప్రాంతాల్లో చిత్రనగరిని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని చారిత్రక ప్రదేశాల వద్ద సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. వచ్చే ఉగాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా సినిమా అవార్డులను ప్రదానం చేస్తుందని తలసాని చెప్పారు. ఆ అవార్డుకు ఏ పేరు పెట్టాలన్న అంశంతో పాటు ఇవ్వాల్సిన పారితోషికతంపై ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. చిత్రనగరిని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.