: రేపు జరపాలనుకున్న జయ అంత్యక్రియలను ఈరోజే నిర్వహించడానికి కారణం!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలను వాస్తవానికి రేపు (బుధవారం) నిర్వహించాలనుకున్నారు. అయితే, చివరకు ఈ రోజే నిర్వహించాలని నిర్ణయించారు. దీనికంతా కారణం రేపు అష్టమి కావడమే. జయలలితకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. జ్యోతిష్కులను సంప్రదించకుండా ఆమె ఏ పనీ చేసేవారు కాదు. ముహూర్తం సరిగా లేదని చివరి నిమిషంలో తెలియడంతో... చివరకు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కూడా ఓసారి వాయిదా వేసుకున్నారు. అష్టమి రోజున ఆమె ఏ కార్యక్రమం చేపట్టేవారు కాదు. దీంతో, ఆమె సెంటిమెంట్లకు అనుగుణంగానే... ఆమె అంత్యక్రియలను అష్టమి రోజున కాకుండా, ఈ రోజే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రోజు సాయంకాలం 4.30 గంటలకు మంచి ముహూర్తం ఉండటంతో... అదే సమయానికి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News