: కాంగోలో భద్రతా బలగాలు, తిరుగుబాటుదారులకు మధ్య తీవ్ర‌ ఘ‌ర్ష‌ణ‌.. 31 మంది మృతి


మధ్య ఆఫ్రికా దేశమ‌యిన‌ కాంగోలోని సెంట్రల్‌ షికాపా రీజియన్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. భద్రతాబలగాలు, గిరిజన తిరుగుబాటు దారులకు మధ్య తీవ్ర‌స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. షికాపా ప్రాంతంలో ఉన్న గిరిజన తిరుగుబాటుదారుల వద్ద‌కు ఆ దేశ భద్రతా బలగాలు, పోలీసులు వెళ్లారు. అయితే తిరుగుబాటుదారులు వారిపై దాడి జరిపి ఆయుధాలను లాక్కొని వారిని చంపేశారు. ఆ త‌రువాత మ‌రికొంత మంది భద్రతా బల‌గాలు అక్క‌డ‌కు చేరుకోవ‌డంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్ప‌డి, ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జ‌రుపుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 13 మంది భద్రతా సిబ్బందితో పాటు మ‌రో 18 మంది తిరుగుబాటుదారులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరో 13 మంది భద్రతా సిబ్బందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.

  • Loading...

More Telugu News