: చెన్నయ్ చేరుకున్న ప్రధాని మోదీ.. విజయవాడ నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబు
అనారోగ్యంతో కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కడసారి వీడ్కోలు పలకడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నయ్ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన రాజాజీహాల్ ప్రాంతానికి చేరుకోనున్నారు. మరోవైపు విజయవాడ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెన్నయ్ బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో జయలలిత పార్థివదేహానికి ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు అధిక సంఖ్యలో ఆమెను చివరిసారిగా చూడడానికి చెన్నయ్ చేరుకుంటున్నారు.