: జయలలితకు పార్లమెంటు ఘన నివాళి... రేపటికి వాయిదా
అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఈ రోజు పార్లమెంటు ఉభయసభలు సంతాపం ప్రకటించాయి. జయలలితకు ఒక్క తమిళనాడే కాకుండా దేశం యావత్తు సంతాపం ప్రకటిస్తోందని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆమె తమిళనాడులో గొప్పపాలనను అందించారని పేర్కొన్నారు. అనంతరం లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలోనూ సభ్యులందరూ జయలలితకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం సభ రేపటికి వాయిదాపడింది. పార్లమెంటు ఆవరణలో పలువురు ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ జయలలిత ధైర్యాన్ని, ఆమె చేసిన సేవలను కొనియాడారు.