: రాజాజీ హాల్ మెట్లపై కూర్చున్న మంత్రులు, ఎమ్మెల్యేలు... అమ్మ ముఖం కనపడడం లేదంటున్న ప్రజలు!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహం రాజాజీ హాల్ లో ప్రజల సందర్శనార్థం ఉంచిన వేళ, అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఇన్ చార్జ్ లు, నామినేటెడ్ పదవులు పొందిన వారు తదితర నేతలు తమదైన శైలిలో అమ్మపై భక్తిని కడసారి చాటుకుంటుండగా, ప్రజలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజాజీ హాల్ వరండాలో దాదాపు 25 మెట్లకు పైన ఐస్ బాక్స్ పై జయలలిత మృతదేహాన్ని ఉంచగా, ప్రజలు సందర్శించేందుకు మూడు వరుసల క్యూలైన్ ను మెట్లకు దిగువన దాదాపు 25 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో నిలబడ్డ పోలీసులు వస్తున్న అభిమానులను నెట్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తమకు అమ్మ ముఖమే కనిపించడం లేదన్నది ప్రజలు, అభిమానుల ప్రధాన ఆరోపణ కాగా, మెట్లపై దాదాపు 300 మంది వరకూ అన్నాడీఎంకే నేతలు కూర్చున్నారు. వీరు తమకు అడ్డు వచ్చారని, అమ్మను చివరిసారి చూడనీయకుండా చేస్తున్నారని క్యూలైన్లలో వచ్చి క్షణకాలం పాటు జయలలితను చూశామని అనుకుని వెళుతున్న వారు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News