: జయ మృతికి సంతాపం.. సెలవు ప్రకటించిన కేరళ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి కేరళ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘అమ్మ’ మృతికి సంతాప సూచకంగా విద్యాసంస్థలకు ఒక రోజు సెలవు ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు, విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఇక జయను కడసారి చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీహాల్‌కు చేరుకుంటున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు.