: నేడు చెన్నైకి రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు.. నగరంలో భారీ బందోబస్తు


తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు నేడు నగరానికి రానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు ఈరోజు చెన్నై చేరుకోనున్నారు. నేరుగా రాజాజీహాల్‌కు చేరుకుని ‘అమ్మ’ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. వారి రాక సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News