: తమిళనాడులో ఏడు రోజులు సంతాపదినాలు.. మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో రాష్ట్రంలో విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అలెర్జీ, డీహైడ్రేషన్‌తో సెప్టెంబరు 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత సుదీర్ఘ చికిత్స తర్వాత సోమవారం రాత్రి కన్నుమూసినట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆమె మృతితో తమిళనాడు శోక సంద్రంగా మారిపోయింది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు.. ప్రతి ఒక్కరు విషాదంలో మునిగిపోయారు. జయ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.