: ఇతర ఆసుపత్రులకు రోగులను తరలిస్తున్న అపోలో సిబ్బంది!
తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో చెన్నైలోని అపోలో ఆసుపత్రి వద్ద ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత మృతి చెందారంటూ వార్తలు రావడంతో పెద్దఎత్తున ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న అమ్మ అభిమానులు విధ్వంసానికి దిగారు. దీంతో అప్రమత్తమైన అపోలో సిబ్బంది హెల్త్ బులెటిన్ విడుదల చేసి, ఆమెకు వైద్యం కొనసాగుతోందని ప్రకటించింది. దీంతో అభిమానులు కొంత శాంతించారు. దీంతో అపోలో ఆసుపత్రి వర్గాలు రంగంలోకిదిగి చికిత్స పొందుతున్న ఇతర రోగులను వివిధ మార్గాల ద్వారా హుటాహుటీన ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఊహించని సంఘటనలు జరిగినా ఇతర రోగులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అపోలో యాజమాన్యం ఈ చర్యలు తీసుకుంది.