: స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం...‘పాక్’ క్రికెటర్లకు గాయాలు


పాకిస్తాన్ లోని కరాచీ లో ఒక స్టార్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం 11 మంది చనిపోగా, 75 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పాక్ క్రికెటర్లు ఇద్దరు ఉన్నారు. ఫోర్-స్టార్ హోటల్ రీజెంట్ ప్లాజాలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ లో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలు నాల్గవ అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ సందర్భంగా యునైటెడ్ బ్యాంక్ లిమిటెట్ జట్టు హెడ్ నదిమ్ ఖాన్ మాట్లాడుతూ, బౌలర్ యాసిన్ మూర్తజా తన ప్రాణాలను కాపాడుకునే క్రమంలో రెండో అంతస్తు నుంచి అమాంతం కిందకు దూకేసరికి, ఆయన చీలమండకు తీవ్ర గాయమైంది. పగిలిన అద్దాల కారణంగా మరో క్రికెటర్ కరామత్ అలీ కూడా గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లోనే ఉన్న సోహెబ్ మక్ సూద్, మంటల్లో చిక్కుకున్న తన కుటుంబసభ్యులను కాపాడుకున్నాడు. మంటల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు మిగిలిన క్రికెటర్లు సహాయపడ్డారని నదిమ్ ఖాన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News