: మరికాసేపట్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఓసారి భేటీ అయిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ కొనసాగనుంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తాము నిర్వహించవలసిన తదుపరి కార్యాచరణపై వారు చర్చించనున్నారు. మరోవైపు కాసేపట్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రికి చేరుకోనున్నారు.