: జయలలిత ఆరోగ్యంపై కాసేపట్లో కీలక ప్రకటన
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా దిగజారిందని, తమ వైద్యులు శ్రమిస్తున్నారని అపోలో ఆసుపత్రి కొంత సేపటి క్రితం ప్రకటించింది. అనంతరం తమిళనాట పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండడానికి తోడు, స్కూళ్లకు సెలవులు, వ్యాపార సముదాయాల మూసివేత, పోలీసులను భారీగా మోహరించడంతో అందర్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి చేరుకోనున్నారు. అనంతరం వైద్యులతో చర్చించిన తరువాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.