: సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేతకు ఊరట
మూడు దశాబ్దాల నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు ఆయనను కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. అక్టోబర్ 31,1984న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన అల్లర్లలో ఆరుగురు సిక్కులు మరణించారు. ఈ ఘటనలో సజ్జన్ కుమార్ పై మూడు కేసులు నమోదవగా, మరో ఐదుగురిపైన కేసు నమోదైంది. వాటిలో ఒక కేసులో ఇప్పుడు సజ్జన్ బయటపడ్డారు. పలుసార్లు విచారణ అనంతరం న్యాయస్థానం సజ్జన్ తో పాటు మరో ఇద్దరిని నిర్ధోషులుగా పేర్కొంది. ఇదే కేసులో ఐదుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. కాగా, కోర్టు తీర్పు విన్న వెంటనే కర్నైల్ సింగ్ అనే వ్యక్తి ఆగ్రహంతో జడ్జిపై షూ విసిరాడు. తక్షణమే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.