: వాట్సప్‌లో మరో రెండు ఆకర్షణీయ ఫీచర్లు!


ఎప్పటిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్‌ల‌ను త‌మ వినియోగ‌దారుల ముందుకు తీసుకొస్తూ ఆక‌ట్టుకుంటున్న సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్ తాజాగా మ‌రో రెండు ఫీచ‌ర్‌ల‌ను తీసుకొచ్చింది. వీడియో స్ట్రీమింగ్‌ సదుపాయంతో పాటు జిఫ్‌ ఫార్మాట్ లో ఫొటోల‌ను పంపించుకోవ‌చ్చని పేర్కొంది. ఇంత‌వ‌ర‌కు బీటా వ‌ర్ష‌న్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచ‌ర్లు ప్ర‌స్తుతం అన్ని స్మార్ట్ ఫోన్ల‌లోనూ అందుబాటులోకి వ‌చ్చాయి. వాట్స‌ప్ లో ఎవరైనా పంపిన వీడియోలను ముందుగా డౌన్‌లోడ్‌ చేసుకుని, ఈ త‌రువాత వాటిని చూసే అవ‌కాశం ఉండేది. ప్ర‌స్తుతం తీసుకొచ్చిన ఫీచ‌ర్‌తో ఇకపై వీడియోల‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవ‌స‌రం లేకుండానే నేరుగా చూసుకోవ‌చ్చు. ఈ వీడియోలు మనకు అవ‌స‌ర‌మ‌యితేనే స్మార్ట్ ఫోన్ల‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవ‌చ్చు. ఇక జిఫ్ ఫార్మాట్ లో 6 సెకండ్ల నిడివి గల వీడియోను పంపుకోవ‌చ్చు. ఫొటోలను యాప్‌లోనే మనకు కావాల్సిన సైజ్‌లో క్రాప్‌ చేసుకోవ‌చ్చు. వాట్సప్‌లో అవ‌త‌లి వ్య‌క్తి పంపిన ఇటువంటి పొటోలు నేరుగా ఫోన్‌లో వాట్సప్‌ డైరెక్టరీలోని యానిమేటెడ్‌ జిఫ్‌ ఇమేజెస్‌ ఫోల్డర్‌లోకి చేరిపోతాయి. ఇక‌ వాట్సప్ ని అప్‌డేట్ చేసుకొని ఈ ఫీచ‌ర్ల‌ను పొందండి.

  • Loading...

More Telugu News