: కాలువలో రద్దైన నోట్లు.. తీసుకోవడానికి పోటీపడ్డ స్థానికులు!


పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత నల్లకుబేరులు తమ వద్ద ఉన్న రద్దైన నగదుని చెత్తకుండీల్లో, నదుల్లో పడేస్తోన్న సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లా హల్ద్వానీ నగరంలో తాజాగా ఇళ్ల మధ్య ప్రవహిస్తున్న ఓ కాలువలో పాత 500, 1000 రూపాయల నోట్లు వెళుతూ కనిపించాయి. వాటిని గమనించిన స్థానికులు కాలువలోకి దిగి ఆ నోట్లను తీసుకోవడానికి పోటీపడ్డారు. కాలువలో చేపలు పడుతున్న మాదిరిగా నోట్లను పట్టుకున్నారు. ఈ విషయం అందరికీ తెలియడంతో కాసేపటికే స్థానికులు అక్కడకు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిని ఓ వ్య‌క్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ విష‌యంపై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని స్థానికులు కాలువలోకి దిగకుండా చర్యలు తీసుకుని, ఈ ఘటనపై ద‌ర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News