: కిడ్నీల వైఫల్యంతో ఆసుపత్రికే పరిమితమైనా... సహాయ గుణాన్ని వీడని సుష్మా స్వరాజ్


కిడ్నీలు పాడైపోయి ఆసుపత్రిలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రజలకు సహాయపడే తన సద్గుణాన్ని మాత్రం వీడలేదు. గడచిన 20 రోజులుగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఆమె, తన సాయం కోరేవారిని ఆదుకుంటూనే ఉన్నారు. ఎయిమ్స్ లోనే పనిచేస్తూ, ఆస్ట్రేలియాకు వీసా కోరుకున్న గీత అనే పీహెచ్డీ స్కాలర్, సుష్మ సాయాన్ని కోరగా, ఆమె స్పందిస్తూ, "గీతా... నేను కూడా ఎయిమ్స్ లోనే ఉన్నాను. నా దగ్గరకు రా. నాకు చేతనైనంత సాయం చేస్తాను" అని ట్వీట్ చేశారు. ఎయిమ్స్ లో పీహెచ్డీ చేస్తున్న గీతా సింగ్, ఈ నెల 7న ఆస్ట్రేలియాలో జరిగే ఓ సమావేశంలో తన అధ్యయనాన్ని సమర్పించాల్సి వుండగా, ఆమెకు వీసా లభించలేదు. దీనిపై ఆమె సాయం కోరుతూ సుష్మను ఉద్దేశించి ట్వీట్ పెట్టగా, సుష్మ సహృదయంతో స్పందించి మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకున్నారు.

  • Loading...

More Telugu News