: జయ పరిస్థితి మరింత విషమం... ఆసుపత్రి వద్దకు సైలెంట్ గా చేరుతున్న పోలీసు బలగాలు
జయలలిత ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి వద్దకు చాలా సైలెంట్ గా పోలీసు వాహనాలు చేరుకుంటున్న నేపథ్యంలో, లోపలి పరిస్థితి అనుమానాస్పదంగానే ఉన్నట్టు... ఆసుపత్రి వద్ద వేచి ఉన్న కార్యకర్తలు, అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు, వందలాది మంది అపోలో ఆసుపత్రికి తరలివస్తున్నారు. జయలలిత కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారంటూ అపోలో వైద్యులు స్పష్టం చేయడంతో... ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. తమ అమ్మ పురచ్చితలైవి ఆరోగ్య పరిస్థితి తెలియక... ఓవైపు, ఏఐఏడీఎంకే మహిళా కార్యకర్తలు కంటతడి పెడుతున్నారు. మరోవైపు, అమ్మను కాపాడాలంటూ రోడ్లమీదే ప్రార్థనలు చేస్తున్నారు.