: ఇక దేవుడిదే భారం, మీరూ ప్రార్థించండి: ట్విట్టర్ లో అపోలో
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని తాము ప్రార్థిస్తున్నామని, ప్రజలు కూడా ఆమె కోసం ప్రార్థనలు చేయాలని అపోలో ఆసుపత్రి, తన ట్విట్టర్ ఖాతాలో కోరింది. ఆమె గుండె, ఊపిరితిత్తులు పనిచేసేలా ప్రత్యేక పరికరాలు వాడుతున్నట్టు చెప్పిన అపోలో, ఆమెకు క్రిటికల్ కేర్ నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఆమెకు ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న విషయమై లండన్ డాక్టర్ బాలేని కూడా సంప్రదించినట్టు తెలుపుతూ, ప్రజల ప్రార్థనలతోనే ఆమె తిరిగి కోలుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Our prayers are with her and we hope she will recover soon. We request all of you to pray for her good health and well being. #GodblessAmma
— Apollo Hospitals (@HospitalsApollo) December 4, 2016