: చెన్నైలో అమెరికన్ కాన్సులేట్ మూత, మిగతా దౌత్య కార్యాలయాలు కూడా!
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో అమెరికన్ కాన్సులేట్ తాత్కాలికంగా మూతపడింది. ఈ ఉదయం 10 గంటల నుంచి కాన్సులేట్ సేవలను నిలిపివేస్తున్నట్టు నోటీసు బోర్డుపై ప్రకటన కనిపించింది. ఇదే సమయంలో తమిళనాడులోని అమెరికన్లు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు తక్షణం చెన్నైకి వచ్చేయాలని సూచన కూడా వెలువడింది. కాగా, అమెరికాతో పాటు చెన్నైలోని ఇతర దేశాల దౌత్య కార్యాలయాలు కూడా ఇదే విధమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.