: మీడియాతో సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకున్న పవన్ కల్యాణ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మధ్యాహ్నం ప్రకటించిన మీడియా సమావేశం రద్దయినట్టు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడతారని నిన్న సమాచారం అందింది. తమిళనాడు సీఎం జయలలితకు హార్ట్ ఎటాక్, ఆపై అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, నేడు మధ్యాహ్నం 12 గంటలకు అపోలో ఆసుపత్రి బులెటిన్ విడుదల కానుండటం, అందులో ఎలాంటి వార్తయినా ఉండవచ్చన్న ఊహాగానాలతో పవన్ తన సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. తదుపరి మీడియా సమావేశం ఎప్పుడు ఉంటుందన్న విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని జనసేన వర్గాలు వెల్లడించాయి. పవన్ ప్రెస్ మీట్ రద్దు విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.