: జయలలితపై వికీపీడియాలో దుష్ప్రచారం!
ఒకవైపు అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతుంటే, అత్యుత్సాహంతో కొందరు ఆమె చనిపోయారని ప్రచారం మొదలు పెట్టారు. వికీపీడియాలో ఆమె డిసెంబర్ 5న గుండెపోటుతో మరణించినట్టు ఒక పేజీని కూడా క్రియేట్ చేశారు. ఆకతాయిలు వివాదాలు సృష్టించేందుకు ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది. క్షణక్షణానికీ ఫేస్ బుక్, వాట్స్ యాప్ లో జయలలిత మరణించారని 'రిప్'లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు భావోద్వేగాలకు లోనయ్యే ఈ తరహా ప్రచారం చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, నేడు 12 గంటలకు జయలలిత ఆరోగ్యంపై అపోలో వైద్యులు ప్రత్యేక ప్రకటన చేయనున్నారు.