: కళ్లన్నీ చెన్నై అపోలో పైనే... నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఎప్పుడు ఏం జరిగిందంటే!


దాదాపు రెండున్నర నెలలుగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మరింతగా విషమించింది. నిన్న ఆమెకు గుండెపోటు రాగా, అప్పటి నుంచి తమిళసీమ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నంత ఉత్కంఠగా మారింది. నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే, * సాయంత్రం 6 గంటలకు జయలలితకు గుండెపోటు * రాత్రి 7:45కు వార్త బయటకు * 8 గంటలకే పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు జనం * టీవీల్లో స్క్రోలింగ్ లు, ప్రత్యేక వార్తలు * 9 గంటలకు ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత * 9:30కి ప్రత్యేక బులెటిన్ విడుదల చేసిన అపోలో * జయకు గుండెపోటు వచ్చిందని ప్రకటన * అర్ధరాత్రి 12:03 నిమిషాలకు గవర్నర్ విద్యాసాగర్ రావు రాక * 9 నిమిషాల అనంతరం 12:14కు రాజ్ భవన్ కు పయనం * 12:30కి విద్యాసాగర్ రావును కలసిన డీజీపీ * ఆపై ప్రత్యేక బలగాలు పంపాలని కేంద్రానికి వినతి * ఈ ఉదయం నుంచి తమిళనాడులో అన్నాడీఎంకే కార్యకర్తల అరెస్టులు మొదలు * మధ్యాహ్నం 12 గంటలకు బులెటిన్ విడుదల చేస్తామన్న అపోలో వైద్యులు

  • Loading...

More Telugu News