: తమిళనాడు కేబినెట్ అత్యవసర భేటీ
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమెను సాధారణ వార్డు నుంచి అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమయింది. అపోలో అస్పత్రిలోనే జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. కాగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి తరలి వస్తున్నారు.